కాళీమాత సిగరెట్ తాగుతున్నట్లుగా సినిమా పోస్టర్.. మండిపడుతున్న హిందూ సంఘాలు

-

‘కాళీ’ చిత్ర నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేకలైకు వ్యతిరేకంగా ఢిల్లీ, యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాళికామాత సిగరెట్ తాగుతున్న పోస్టర్ ను ఆమె విడుదల చేయడంపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నేరపూరిత కుట్ర, దేవతల పట్ల అపచారం, మత మనోభావాలను గాయపరచడం, శాంతికి ఉద్దేశ్యపూర్వకంగా భంగం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఈ పోస్టర్ పై ఫిర్యాదు చేశారు.

అలాగే గో మహాసభ నేత అజయ్ గౌతమ్ పోలీసులకు, కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేశారు. లీనా మణిమేఖలై కాళీ సినిమా పోస్టర్ను సామాజిక మాధ్యమాల వేదికపై షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కెనడాలో చెన్నైలో శరణార్దిగా నివసిస్తుంది. శరణార్థి రక్షణ చట్టం కింద ఆమెకు రక్షణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ భారత ఎంబసీ ఇప్పటికే తన అభ్యంతరాన్ని కెనడాకు తెలియజేసింది. కాళికా మాతను అగౌరవంగా చూపిస్తున్న పోస్టర్లను తొలగించాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news