పాకిస్తాన్ తో యుద్ధం చేయకతప్పదు.. కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

-

జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే భయాందోళనకు గురిచేయడానికి ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడిగా అభివర్ణించారు. సోమవారం ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు.

కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం అంతమైందని.. ఇలాంటి ఘటనలు మళ్లీ కొనసాగితే పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయకతప్పదని హెచ్చరించారు. కేవలం భయాన్ని సృష్టించడానికే ఈ తరహాదాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనేక మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తున్నారని, ఉగ్ర ఘటనలు పునరావృతం అయితే పీవోకేను ఆక్రమించుకోవాల్సిన అవసరం వస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 9 మరణించగా.. దాదాపు 41 మంది గాయపడిన విషయం తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news