డిసెంబర్ 31 లోగా ఈ పనులని పూర్తి చేసుకోవాలి..!

-

ముఖ్యమైన పనులని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. డెడ్ లైన్ రాకుండా వాటిని పూర్తి చేసేసుకుంటూ ఉండాలి. డిసెంబర్ ముగియడానికి ఇంకో రెండువారాలు ఉంది. పైగా ఈ ఏడాది కూడా పూర్తి అయ్యిపోతోంది.

 

అయితే ఈ లోగా వీటిని పూర్తి చేసుకోండి. మరి ఈలోగా ఏ పనులు పూర్తి చేసుకోవాలి..? అనేది ఇప్పుడు చూద్దాం. పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్ ఐటీ రిటర్స్ ఫైల్ చేయాలి, పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తమ నామినీ వివరాలు ఈ నెలాఖరులోగా అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

నామినీ పేరు యాడ్ చేసుకోవాలి:

పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ నామినీ పేరు యాడ్ చేయాలని ఈపీఎఫ్ఓ చాలా కాలంగా చెబుతోంది. 2021 డిసెంబర్ 31 నాటికి నామినీ వివరాలు యాడ్ చేయాలి. డిసెంబర్ 31 లోగా పీఎఫ్ అకౌంట్‌కు నామినీ పేరు యాడ్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈపీఎప్ఓ వెబ్‌సైట్ epfindia.gov.in ఓపెన్ చేసి…Services’ సెక్షన్‌లో ‘For Employees’ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ‘Member UAN/Online Service (OCS/OTCP)’ సెలెక్ట్ చేయాలి. యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. నెక్స్ట్ ‘Manage’ పేజ్‌లో ఇ-నామినేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ‘Add Family Details’ క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయాలి అంతే.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్:

అదే విధంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. కనుక ఈ గడువు లోగా ఫైల్ చెయ్యండి. లేదంటే పెనాల్టీ పడుతుంది.

హోమ్ లోన్:

బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది. కొత్త లోన్‌తో పాటు హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు పొందొచ్చు.

ఆడిట్:

ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు ఐటీ రిటర్స్‌తో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి. ఈ నెలాఖరులోగా ఆడిట్ రిపోర్ట్ ఫైల్ తప్పక చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news