నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

-

నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో గంట సమయంలోనే త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

మధ్యాహ్నం 1 గంటల వరకు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో… ఏ పార్టీ లీడ్‌ లో ఉందో క్లారిటీ రానుంది. ఇక సాయంత్రం 5 గంటల లోపు….. పూర్తి ఫలితాలు వస్తాయి. కాగా, గత ఐదేళ్ళుగా “డబుల్ ఇంజన్” ( కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండడం) ప్రభుత్వం చేసిన కృషి వల్ల దేశ సరిహద్దు రాష్ట్రమైన త్రిపుర లో అభివృద్ధి పుంజుకుంటోందని ప్రచారం చేశారు బిజేపి నాయకులు. గతంలో “ఇండైజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర” ( ఐ.పి.ఎఫ్.టి) భాగస్వామ్యంతో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బిజెపి. ఇక ఈ సారి బిజెపి 55 స్థానాల్లో పోటీ చేయగా…త్రిపురలో మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news