నకిలీ ఆధార్ కార్డు తెలుసుకోవడానికి.. 2 నిమిషాలు..!

-

ఆధార్ కార్డు అనేది ప్రతి పౌరుడి సామాన్య హక్కు. స్కూల్ అడ్మిషన్ మొదలు.. అన్నింటికీ ఆధార కార్డు తప్పనిసరిగా కావాల్సిందే. మన సమాచారం అంతా ఒక్క నంబర్ కొడితే చాలు వచ్చేస్తుంది. అయితే, కొందరు కేటుగాళ్లు ఆధార్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్టును సృష్టించి తమ పనిని కానిచ్చేస్తున్నారు. అందుకే వారు ఇచ్చిన ఆధార్ కార్డు నకిలీదా? ఒరిజినలా? అనేది ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది.

Aadhar
Aadhar

ఆధార్ కార్డు నకిలీ అని తేల్చుకోలేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. మోసాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ సంస్థ ఉడాయ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రెండు నిమిషాల్లోనే ఆధార్ కార్డు నిజమైనదా? నకిలీదా? ఇట్టే తేల్చుకోవచ్చు. కానీ నకిలీ ఆధార్ కనుక్కోవటం ఎలా అనేదేగా మీ ప్రశ్న.. దీనికోసం మీరు ఏ నెట్ సెంటర్‌కు పరుగులు పెట్టక్కర్లేదు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగక్కర్లేదు.

మీ ఫోన్లో ఆధార్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత.. వేరిఫై ఆధార్ అని ఆప్షన్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆపై క్యాప్చా కోడ్ వస్తుంది అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత వేరిఫై ఆధార్ అనే ఆప్షన్‌ వస్తుంది.. దాన్ని క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఆధార్ కరెక్టయితే మీ పూర్తి వివరాలు వస్తాయి. మన చేతిలో ఉన్న కార్డులో వివరాలు ఫోన్లో వచ్చిన వివరాలు సరిపోల్చుకోండి. రెండు ఒకటే అయితే కార్డు ఓరిజినల్ లేదంటే నకిలీ అనే అర్థం.

యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు..
గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ‘మాఆధార్’ యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో వేరిఫై ఆధార్ అని స్కాన్ ఆప్షన్ మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ స్కానర్ సాయంతో ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసిన వెంటనే కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఆ వివరాలు, కార్డుపై ఉన్న వివరాలతో సరిపోల్చి చూసుకోవాలి. వివరాలు మీకు సంబంధించినవి వస్తే అది ఒరిజినల్ అని.. మీ వివరాలు లేకపోతే అది నకిలీ అని నిర్ధారించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news