గోల్డ్ కొనాలనుకునేవారికి శుభవార్త. నేడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,800 పలుకుతోంది. అంటే , నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గింది. ఒక్క గ్రాము బంగారం రేటు రూ. 4,480.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.48,800 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.4,888 కి లభిస్తోంది.
అయితే, దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కోల్‌కతా– 47,300, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో రూ.44,800. చెన్నై– 45,260, ముంబై– 46,970, న్యూఢిల్లీ– 46,950.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర చెన్నైలో రూ.49,380, ముంబైలో 47,970, న్యూఢిల్లీలో 51,220, కోల్‌కతాలో 49,900, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 48,800కు లభిస్తోంది. గడచిన పది రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు తగ్గాయి. రెండు సార్లు స్థిరంగా ఉన్నాయి, మూడు సార్లు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 72,300కి లభిస్తోంది. 10 గ్రాముల వెండి రూ.723. నిన్నటితో పోల్చితే రూ.8 తగ్గింది.