ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా..!

-

ఉపాధి ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. మనిషి బలహీనతనే బిజినెన్ గా చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్ఎఫ్సీఎల్) కొంతమంది దళారులకు కాసుల వర్షం కురిపి స్తోంది. సంస్థను పునరుద్ధరిస్తున్న తరుణంలో ఉద్యో గాల పేరిట నిరుద్యోగులకు కొందరు వల విసురుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మొత్తం నాలుగు జిల్లాలకు వ్యాపించటంతో పోలీసులు షాక్ అయ్యారు.

కొన్ని సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్ధరిస్తుండడం తెలిసిందే. అయితే అది ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.దీన్నే అవకాశంగా తీసుకుని దళారులు దందా మొదలుపెట్టారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు నేరుగా ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండగా, సెమీస్కిల్డ్, అన్ స్కిల్డ్ పోస్టులను మాత్రం స్థానికంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది విభాగాల వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించి, వారి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులను భర్తీ చేస్తారు.

కాంట్రాక్ట్ పద్దతే అయినా.. భవిష్యత్తులో రెగ్యులరైజ్ అవుతుందనే నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు లక్షలు పోసి పోస్టులు కొంటున్నారు. ఈ ముఠాలో రాజకీయ నాయకులు హస్తం కూడా ఉందని తెలుస్తోంది. లక్షలు అప్పుచేసి అమాయకులు డబ్బుకట్టారు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. కట్టిన డబ్బుకూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై మీడియాలో కథానాలు రావడంతో మోసపోయామని ఆందోళన చెందుతున్నారు.

ఈ దందా ఒక్క జిల్లాతో ఆగలేదు.. పక్కనే ఉన్న కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల తదితర జిల్లాలో బాధితుల సంఖ్య అధికంగానే ఉన్నట్లు సమాచారం. లక్షలు డబ్బు వారికి ఇచ్చి ఇప్పుడు వాటికోసం దళారుల చుట్టు తిరిగుతున్నారు. ఈ దందాకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి…పోస్టుల భర్తీ పారదర్శకంగా చేయాలని నిరుద్యోగులు సర్కారును వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news