ట్రాయ్ కొత్త రూల్స్‌తో చిక్కులు.. సెప్టెంబర్ 1 నుంచి OTPలు రావా..?

-

స్పామ్ కాల్స్, మెసేజ్లను అడ్డుకోవడానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు సమస్యలను తీసుకువచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మెసేజ్లను అడ్డుకోవడానికి తెచ్చిన రూల్స్ తో బ్యాంకులు, ఫైనాన్షియల్స్ సంస్థలు ఈ కామర్స్ కంపెనీల నుంచి వచ్చే మొబైల్ ఓటిపిల్లో అవాంతరాలు ఏర్పడే ఛాన్స్ ఉందని టెలికాం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ కారణంగా తమకు కాస్త గడువు కావాలని టెలికాం సంస్థలు కోరుతున్నాయి. సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేనని పట్టు మీద ఉన్నట్లు సమాచారం.

యుఆర్ఎల్స్, ఓటిటి లింక్స్ అలాగే ఏపీకే ఫైల్స్ ఉండే మెసేజ్లు వైట్ లిస్ట్ చేయని కాల్ బ్యాంక్ నెంబర్లతో ఉండే మెసేజ్లను ఆపేయాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలను జారీ చేసింది. ఆగస్టు 31 లోగా మెసేజ్లు కంప్లీట్ కంటెంట్ తో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. మెసేజ్లు పంపే వివిధ సంస్థలు మాత్రమే గతంలో టెలికం సంస్థ నిబంధన ప్రకారం సందేశాల లోపల ఎలాంటి కంటెంట్ ఉంది ఉందో ఏ సంబంధం లేకుండా సందేశాలు బదిలీ అవుతాయి.

కానీ ఇకపై అలా కుదరదు ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త రూల్స్ ప్రకారం బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ టెక్నాలజీకి టెలికాం సంస్థలు మారాలి. ప్రతి మెసేజ్ చదవాలి. నిబంధనలకి అనుగుణంగా లేని వాటిని బ్లాక్ చేయాలి. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి ఈ గడువు పొడిగించాలని ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో సంస్థలు ట్రాయ్ ని కోరాయి. గడువులోపు మెసేజ్లు వైట్లిస్ట్ చేసుకోకపోతే అంటే రిజిస్టర్ చేయకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి అలాంటి మెసేజ్లు ఆగిపోయే ప్రమాదం ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news