బెయిల్ పై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..!

-

ఈడీ ది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుంది అని కవిత న్యాయవాది మోహిత్ రావు అన్నారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినవారు కేసులో నిందితులుగా కూడా లేరు. కాబట్టి సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉంది. విద్యాధికురాలు, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆమె మహిళ కాకుండా పోరు అని సుప్రీంకోర్టు పేర్కొంది.

అయితే నేను మొదటినుంచి అరెస్టు అక్రమం అని చెబుతూ వచ్చాను. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అది నిరూపితమైంది అని తెలిపారు. అలాగే ఈడీ, సీబీఐ అసంబద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టులో బెయిల్ బాండ్స్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం జైలు నుంచి కవిత విడుదల అవుతారు. అయితే ఈ రోజే కవిత విడుదల అవుతారు అని ఆమె న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news