వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్స్ తొలగించిన ట్విట్టర్..!

వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్యనాయుడు ట్విట్టర్ ఎకౌంట్ కి బ్లూటిక్స్ ని తొలగించింది ట్విట్టర్. ఇలా బ్లూటూత్ ని వైస్ ప్రెసిడెంట్ ఎకౌంట్ నుంచి తొలగించడం వల్ల ప్రజలకు కోపం వచ్చింది. దీని గురించి బీజేపీ లీడర్ Suresh Nakhua ఎందుకు బ్లూ టిక్స్ ని వైస్ ప్రెసిడెంట్ ఎకౌంట్ నుంచి తొలగించారు అని అడిగారు.

ఇది ఇలా ఉంటే ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎటాక్ అని అంటున్నారు. అయితే చాలా రోజుల నుండి యాక్టివ్ గా లేక పోవడం కారణంగా అది ఆన్ వెరిఫై అయిందని అంటున్నారు. ట్విట్టర్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రకారం చూసుకుంటే ఎవరైనా హ్యాండిల్ పేరు మార్చినా, అకౌంట్ ఇన్ ఆక్టివ్ లేదా ఇన్ కంప్లీట్ గా వున్నా అది ఆలా అవుతుందని..

లేదా ఒకవేళ ఎక్కువ కాలం నుంచి వాడకపోతే కూడా ఇలా జరుగుతుందని అంటున్నారు. దీని కారణంగా బ్లూ టిక్స్ తొలగించారని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో ట్విట్టర్ కి ప్రభుత్వానికి మధ్య చిన్న చిన్న విభేదాలు కూడా పెరిగిపోయాయి కొత్త గైడ్ లైన్స్ ని ఇంకా ట్విట్టర్ ఒప్పుకోలేదు.