తమిళనాడు కేబినెట్ లోకి సీఎం స్టాలిన్ కొడుకు.. రేపే ప్రమాణ స్వీకారం

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ముద్దుల కొడుకు, టాలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్ ను తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఉదయనిది డీఎంకే యువజన విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమం లో స్టాలిన్ కొడుకు ఉదయినిది చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలోకి తన కుమారుడని తీసుకునేందుకు స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీఎంకే నేతలు అలాగే కార్యకర్తల ఒత్తిడితో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉదయనిధికి క్రీడాభివృద్ధి శాఖ అలాగే యువజన సంక్షేమ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. డిసెంబర్ 14వ తేదీన అంటే, రేపు ఉదయం ఉదయనిది మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.