ఉక్రెయిన్ విద్యార్థులతో ఢిల్లీ చేరుకున్న విమానం…. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా

-

ఉక్రెయిన్ – రష్యా సంక్షోభం మధ్య ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించే కార్యక్రమం జరుగుతోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకువస్తున్నారు. శనివారం సాయంత్రం తొలి బ్యాచ్ విద్యార్థులను రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఎయిరిండియా విమానంలో తీసుకువచ్చారు. వీరికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. 

తాజాగా ఆదివారం తెల్లవారుజామున రెండో బ్యాచ్తో మరో విమానం ఢిల్లీకి చేరుకుంది. 250 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరందరిని.. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా రిసీవ్ చేసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి సింథియా… ప్రతీ ఒక్క భారతీయుడిని స్వదేశానికి తీసుకువస్తామని.. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు చేరవేయాలని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడితో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. మరో విమానం హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 విద్యార్థులతోొ ఢిల్లీకి బయలుదేరింది.

Read more RELATED
Recommended to you

Latest news