రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ కి అతిపెద్ద సవాల్ గా మారింది. సిఎం అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గానూ ఎమ్మెల్యేలను హోటల్ లో ఉంచారు. అసెంబ్లీ లో బల పరీక్ష చేసుకుంటా నాకు అనుమతి ఇవ్వండి అంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ని అడిగినా సరే గవర్నర్ మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. దీనితో ఎమ్మెల్యేలను హోటల్ లో ఉంచి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
![cm ashok gahleth](https://cdn.manalokam.com/wp-content/uploads/2020/08/క.jpeg)
తాజాగా ఆయన ఎమ్మెల్యేలు ఉంచిన హోటల్ లో ఒక సంగీత కచేరి ఏర్పాటు చేసారు. జైసల్మేర్‌లోని హోటల్ సూర్యగర్ లో ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంగీత కచేరీకి హాజరయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ హోటల్‌లో ఉంచారు. రాజస్థాన్ పాటలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో.
#WATCH Congress MLAs staying at Hotel Suryagarh in Jaisalmer attend a musical concert.
Congress MLAs supporting Chief Minister Ashok Gehlot are lodged at the hotel. pic.twitter.com/xuP7ag8qt9
— ANI (@ANI) August 7, 2020