అమెరికాకు చెందిన హిండెన్ బర్డ్ రీసెర్చ్ సంస్థ ఇవాళ ఒక అర్థం కానటువంటి ట్వీట్ పోస్ట్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. భారతదేశంలో మరో సంచలనం బయటపడనున్నట్టు ఆ ట్విట్టర్ (ఎక్స్) పోస్ట్ ద్వారా హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించింది. ఇటీవలే అదానీ స్టాక్ మార్కెట్ పై హిండెన్ బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టుతో ఆ సంస్త యొక్క మార్కెట్ విలువ దారుణం పడిపోయింది.
అయితే ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన పోస్ట్.. ఇండియా మరో సంచలనాన్ని నమోదు చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన పోస్ట్ ఇప్పటికే అందరినీ ఆకర్షిస్తున్నది. అదానీ అంశంలో ఆ సంస్థకు సెబీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టేసింది. కానీ తమ గ్రూపు కంపెనీలు దాదాపు వంద బిలియన్ డాలర్ల వరకు నష్టపోయినట్టు ఆ సంస్థ వెల్లడించింది.