శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక మా హస్తం లేదు: బిజెపి

-

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది.శివసేన కీలక నేత ఎక్నాధ్ షిండేతో పాటూ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి గౌహతి లోని ఓ హోటల్ లో బస చేశారు.మరోవైపు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.

తిరుగుబాటు అనేది శివసేన అంతర్గత వ్యవహారమని..దాని వెనుక బీజేపీ హస్తం లేదని అన్నారు.తమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫేడ్నవీస్ ఢిల్లీకి వెళ్లాలని చెప్పారు.నిన్న మధ్యాహ్నం ఫేడ్నవీస్ తో కలిసి తాను భోజనం చేశానని..ఆ తర్వాత ఆయన ఢిల్లీకి పయనమయ్యారు అని తెలిపారు.తాము కలిసినప్పుడు శివసేన సంక్షోభంపై తనతో ఎక్కువగా చర్చించలేదు అని చెప్పారు.శివసేన లో ఏం జరుగుతుంది అనే విషయం గురించి తాను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news