వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఏకంగా 2009 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై ఓడిపోయింది టీమిండియా. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను… కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్యాన్స్ అలాగే కొంతమంది క్రీడా విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.
WTC ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోగా… ఒకవేళ రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో అజింక్య రహనే, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అయితే క్రికెట్ అభిమానులు శ్రేయస్ కెప్టెన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో శ్రేయస్ లేదా రహనే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని ట్వీట్ చేస్తున్నారు.