తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయాలన్నింటిలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ప్రత్యేక అర్చనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. కేసీఆర్పై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
హిందూ గాళ్లు.. బొందు గాళ్లు.. అంటూ దుర్భాషలు ఆడే కేసీఆర్.. తాను భయంకర హిందువు అని ప్రగల్భాలు పలుకుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ‘యాదాద్రేమో మీకు పెట్టుబడి.. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి’ అంటూ విమర్శించారు. కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప.. చేతలు లేవు అన్నారు. ‘భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి…మన ధర్మాన్ని తిట్టేవాన్ని తలపైకెత్తుకుంటారు’ అంటూ ధ్వజమెత్తారు. ఆత్మ సాక్షిగా కూడా అబద్ధమే చెప్పే కేసీఆర్కు ఆధ్యాత్మికత ఇంకెక్కడిదని ప్రశ్నించారు.
హిందూ గాళ్ళు, బొందు గాళ్ళు అంటూ దుర్భాషలు
భయంకర హిందువుని నేనంటూ ప్రగల్భాలు
యాదాద్రేమో మీకు పెట్టుబడి
కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి
కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు
భారతీయ సనాతన…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 21, 2023