గుజరాత్ లో గెలుపు ఆ పార్టీదేనా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..?

గుజరాత్ లో రెండు దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ముందుగా ఊహించినట్లుగానే మోదీ ఇలాఖాలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తుంది. 27 ఏళ్లుగా ఆ పార్టీని అధికారం నుంచి తప్పించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఫలితం లేదు.

2012లో 182 స్థానాలలో పోటీ చేసి 115 స్థానాలలో గెలిచిన బిజెపి.. 2017లో 99 సీట్లకే పరిమితమైంది. కానీ ఈసారి 125 – 130 స్థానాలలో గెలిచి భారీ మెజారిటీ సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్ లో బీజేపీకి 130కి పైగా స్థానాలు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జన్ కీ బాత్ సర్వేలో.. బీజేపీకి 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ -6-13 స్థానాలు రానున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా. బీజేపీ-125-143, కాంగ్రెస్ 30-48, ఆప్ 3-7: పీపుల్స్ పల్స్ సర్వే. న్యూస్ ఎక్స్: బీజేపీకి 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ 6-13. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉండనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. పీపుల్స్ పల్స్: బీజేపీ-29-39, కాంగ్రెస్ 27-37, ఇతరులు 2-5.