ఒకే సంస్థ‌లో 5 ఏళ్ల క‌న్నా ఎక్కువ‌గా ప‌నిచేస్తే పీఎఫ్ విత్‌డ్రాకు ప‌న్ను ఉండ‌దు.. తెలుసా..?

-

నేనొక కంపెనీలో 8 ఏళ్ల పాటు ప‌నిచేశాను. ఈపీఎఫ్ లో డ‌బ్బులు జ‌మ అయ్యాయి. త‌రువాత ఇంకో కంపెనీలో చేరాను. 14 నెల‌ల పాటు ప‌నిచేశాను. కానీ వారు పీఎఫ్ స‌దుపాయం క‌ల్పించ‌లేదు. త‌రువాత కొన్ని నెల‌లు ఖాళీగా ఉన్నాను. త‌రువాత ఇంకో పెద్ద కంపెనీలో చేరాను. అందులో 5 ఏళ్ల పాటు ప‌నిచేశా. పీఎఫ్ చెల్లించా. ఇప్పుడు పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే ప‌న్ను వ‌సూలు చేస్తారా ?

పీఎఫ్

పైన తెలిపిన లాంటి సందేహాలే నిజానికి చాలా మంది పీఎఫ్ చందాదారుల‌కు క‌లుగుతుంటాయి. ఉద్యోగం అన్నాక ఒక్క చోట స్థిరంగా ఉండ‌దు క‌దా. అనేక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కొంద‌రు కొన్ని సంస్థ‌లు మారుతుంటారు. కొంద‌రు ఒకే కంపెనీలో ఎక్కువ రోజులు ప‌నిచేస్తారు. అయితే పీఎఫ్ ను చెల్లిస్తుంటే దాన్ని ఒకేసారి విత్‌డ్రా చేస్తే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుందా ? అంటే.. అవును, ఉంటుంది.

ఏదైనా కంపెనీలో ఉద్యోగి 5 ఏళ్లు అంత‌కన్నా ఎక్కువ స‌మ‌యం పాటు ప‌నిచేస్తే.. పీఎఫ్ జ‌మ చేస్తే.. పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకుంటే ప‌న్ను చెల్లించాల్సిన ప‌నిలేదు. 5 ఏళ్ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ప‌నిచేస్తేనే ప‌న్ను వ‌ర్తిస్తుంది. పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ‌నే తీసుకుంటే..

ఆ వ్య‌క్తి 8 ఏళ్ల పాటు ఒక కంపెనీలో ప‌నిచేశాడు. 5 ఏళ్ల క‌న్నా ఎక్కువగా ఒకే కంపెనీలో చేసిన అనుభ‌వం, అన్ని ఏళ్ల పాటు నిరంత‌రాయంగా పీఎఫ్ క‌ట్టిన సౌల‌భ్యం ఉంది కాబ‌ట్టి అత‌ను మొద‌టి కంపెనీతోపాటు చివ‌రి కంపెనీలోనూ పీఎఫ్ విత్‌డ్రా చేస్తే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే దీనికి కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఒక కంపెనీలో 5 ఏళ్లు నిరంత‌రాయంగా ప‌నిచేసి ఉండాలి. పీఎఫ్ జ‌మ చేసి ఉండాలి. ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌క‌పోతే విత్‌డ్రా చేసే పీఎఫ్‌కు ప‌న్ను చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news