దిల్లీలో టెన్షన్ టెన్షన్.. మళ్లీ డేంజర్ మార్క్​ దాటిన యమునా నది

-

భారీ వర్షాలతో ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని అస్తవ్యస్తమవుతోంది. ఓవైపు ఎగువ నుంచి వస్తున్న వరద.. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. మరోసారి డేంజర్ లెవెల్ ను దాటి 206.42 మీటర్ల ఎత్తులో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమమంలో రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు దిల్లీ -షాహదారా మధ్య రాకపోకలు నిలిపేశామని, రైళ్లు న్యూ దిల్లీ మీదుగా మళ్లించామని వివరించారు.

యమునా నది నీటిమట్టం పెరుగుతుండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభావం పడుతోందని అధికారులు అంటున్నారు. మరోవైపు రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దిల్లీ వణికిపోతోంది. హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి భారీగా వరద పోటెత్తితే దేశ రాజధాని మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా దిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news