యాసిన్ మాలిక్ అక్రమ శిక్షపై యూఎన్ జోక్యం చేసుకోవాలి: షాషీద్ ఆఫ్రిది

-

కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏ కోర్ట్ ఈ రోజు యావజ్జీవ శిక్ష విధించిందిా. అయితే ఆయనకు మద్దతుగా పాక్ లోని కొంతమంది పెడబొబ్బలు పెడుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్ షాషీద్ ఆఫ్రిది ఓ అడుగు ముందుకేసి ఈ కేసులో యూఎన్ జోక్యం చేసుకోవాలని ట్వీట్ చేశారు. యాసిన్ మాలిక్ ను కాశ్మీర్ స్వాతంత్య్ర పోరాట యోధుడిగా ఆప్రిది అభివర్ణించాడు. అయితే ఎన్ ఐఏ కోర్ట్ తాను చేసిన అన్ని నేరాలను అంగీకరించాడు యాసిన్ మాలిక్. 

యాసిన్ మాలిక్ కు మద్దతుగా ట్వీట్ చేశాడు. ‘‘ భారత్ ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని… విమర్శించే గొంతులను నొక్కేస్తోందని… యాసిన్ మాలిక్ పై కల్పిత ఆరోపణలు చేస్తోందిన.. కాశ్మీర్ స్వాతంత్య్ర పోరాటానికి ఇవేవీ అడ్డుకట్ట వేయవు అని.. కాశ్మీర్ నేతలపై అన్యాయమైన, అక్రమ కేసులపై యూఎన్ చొరవ తీసుకోవాలని’’ ట్వీట్ చేశాడు. ఎన్ఐఏ కోర్ట్ మాలిక్ కు శిక్ష విధించిన తర్వాత ఆఫ్రిదీ ఈ ట్వీట్ చేశాడు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news