ఈ పూలకు మార్కెట్లో డిమాండ్ మాములుగా లేదుగా..! సాగుచేస్తే ఆదాయం లక్షల్లోనే..

-

నేటి యువతకు ఉద్యోగాలు చేయడం కంటే.. ఏదో ఒక వ్యాపారం చేయాలనే కోరికే ఎక్కువ ఉంది. నెలంతా కష్టపడితే కానీ..నెలాఖరకు వచ్చే జీతం.. అలా అకౌంట్ లో పడీపడక ముందే..కట్ అయ్యే ఈఎమ్ఐలు.. ఇలాంటి లైఫ్ ను చాలామంది కోరుకోవడం లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. ఆలోచన బానే ఉంది.. కానీ దానికి సరిపడా దుడ్డుకావాలి కదా..ఇక్కడే సగం మంది ఫిల్టర్ అయిపోతున్నారు. మీకు తెలుసా..? నేడు కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న చాలా వ్యాపారాలు.. వెయ్యి, ఐదువేలు, పదివేలు..ఇలాంటి మొత్తం పెట్టుబడితోనే స్టాట్ అయ్యాయని. లక్షలు ఉండక్కర్లా..లక్ష్యసాధన ఉంటే చాలండోయ్..! అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా ఏంటో చూద్దామా..!
ట్యూబెరోస్ పువ్వులు.. ఇవి చాలా కాలం పాటు తాజాగా, సువాసనగా ఉంటాయి. మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ ఉండడానికి ఇదే కారణం. వివాహాలకు, అన్ని రకాల ఫంక్షన్స్ కు ఈ పూలనే అధికంగా ఎంచుకుంటున్నారు. వీటిని ఇంకా సుగంధ ద్రవ్యాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇప్పటికే చాలామంది రైతులు ఈ పూలసాగువైపు అడుగులు వేశారు.

ఇండియాలో ఎక్కడంటే..

భారతదేశంలో ఇది పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ పూలు పండిస్తున్నారు. దేశంలో దాదాపు 20 వేల హెక్టార్లలో దీనిని సాగు చేస్తున్నారట.. ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాల్లో కూడా ఈ పువ్వుని పండిస్తున్నారు. అయితే ఈ పువ్వు మొదటగా మెక్సికోలో పుట్టింది.
ట్యూబెరోస్ పువ్వుల పెంపకం కోసం మొదటగా పొలంలో.. ఎకరానికి 6-8 ట్రాలీ ఆవు పేడతో మంచి కంపోస్ట్‌ను చల్లాలి. అలాగే డీఏపీ వంటి ఎరువులను ఉపయోగించవచ్చు. ఈ పువ్వులు దుంపల ద్వారా వస్తాయి. ఒక ఎకరంలో దాదాపు 20 వేల దుంపలు వేయాలి. మీరు అవసరమనుకుంటే ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా తీసుకోవచ్చట. ఈ పువ్వులని సమీపంలోని దేవాలయాలు, పూల దుకాణాలు, పెళ్లి గృహాలు మొదలైన వాటిలో సులభంగా విక్రయించవచ్చు. ఒక పువ్వు 5 నుంచి 6 రూపాయలకు అమ్ముడవుతోంది. అంటే ఎకరంలో పండే పూలతో
 ఈజీగా రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఆసక్తి ఉంటే.. ఈ పూలు సాగు, లాభనష్టాలపై మరింత రీసర్చ్ చేసి స్టెప్ తీసుకోండి.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news