యూజర్స్ కు షాక్.. జీమెయిల్, యూట్యూబ్ డౌన్

-

జీమెయిల్, యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సేవలకు అంతరాయం ఏర్పడంతో అనేక దేశాల్లోని యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూగుల్ వర్క్ స్పేస్ లోకి లాగిన్ కాలేకపోతున్నామని ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. యూట్యూబ్ లోనూ వీడియోలు చూడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు.

జీ-మెయిల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే మెయిల్ సర్వీస్. అనేక కంపెనీలు, కోట్లాది మంది ఉద్యోగులు, ఇతర యూజర్లు జీ మెయిల్, గూగుల్ వర్క్ స్పేస్ ను రోజువారి కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్ కూడా కోట్లాది యూజర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ రెండింటి సేవల్లో అంతరాయం కలగడంతో కోట్లాది మంది నెటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సేవల అంతరాయానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై గూగుల్ సంస్థ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. యూజర్ల సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇంకా చూపలేదు.

Read more RELATED
Recommended to you

Latest news