కరోనా బారిన పడిన వ్యక్తి నుంచి వెలువడే తుంపరలు భిన్న రకాల ఉపరితలాలపై నిర్దిష్టమైన సమయం పాటు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఉపరితలాలను తాకే వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటి ఉపరితలాలను 99.99 శాతం శుభ్రం చేసే కొత్త యాంటీ వైరల్ కోటింగ్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దాన్నే యుడెఫ్‌గా అందుబాటులోకి తెచ్చారు.
ఢిల్లీకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ తురియా ఇన్వెస్ట్‌మెంట్స్.. లోక్ కవచ్ హెల్త్‌కేర్ బ్రాండ్ పేరిట యుడెఫ్ (Yudef) అనే యాంటీ వైరల్ కోటింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఎలాంటి ఉపరితలంపై అయినా కోటింగ్ వేయవచ్చు. దీంతో ఆ ఉపరితలంపై కోవిడ్ లేదా ఇతర ఏవైనా వైరస్‌లు, బాక్టీరియాలు చేరితే వెంటనే అవి నశిస్తాయి. ఇక ఈ కోటింగ్ వల్ల మనుషులకు ఎలాంటి హాని ఉండదు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాకే ఈ కోటింగ్‌ను ప్రవేశపెట్టామని సదరు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ యాంటీ వైరస్ కోటింగ్‌ను అనేక రకాల ఉపరితలాలపై వేయవచ్చు. టేబుల్స్, డెస్క్‌టాప్స్, కౌంటర్ టాప్స్, ఫ్లోర్స్, దుస్తులు, ఇతర ఉపరితలాలపై వేయవచ్చు. దీంతో సూక్ష్మ క్రిములను ఈ కోటింగ్ 99.995 శాతం వరకు చంపుతుంది. కోవిడ్ ను కూడా నాశనం చేస్తుంది. ఈ యాంటీ వైరస్ కోటింగ్‌ను రూ.699 కు మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు.