పెళ్లి తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్ !

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుని ఇటీవలే వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. నయనతార తన రెమ్యూనరేషన్‌ పై కీలక నిర్ణయం తీసుకుందట. ఇక నుంచి ఒక్క సినిమాకు రూ.10 కోట్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలాగ అయితేనే సినిమాలు చేస్తానని భీమ్మించుకుని కుర్చుంది ఈ బ్యూటీ.

లేకపోతే.. తాను సినిమాలు కూడా చేయకూడదని అనుకుంటోందట. కాగా.. గాడ్‌ ఫాదర్‌ సినిమాలో నయన తార నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయన తార రూ.4 కోట్లు తీసుకుంటోందట.

Read more RELATED
Recommended to you

Latest news