NBK 107 : బాలయ్య కొత్త మూవీ లాంచ్.. ఫోటోలు వైరల్

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ సినిమా… షూటింగ్‌ ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే… మరో బిగ్‌ ప్రాజెక్టు ను ఓకే చేశారు నందమూరి బాలయ్య. క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు లిటిల్ పిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమా పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది.  ఈ సినిమాను వి. వి. వినాయక్‌ క్లాప్‌ కొట్టి ప్రారంభించారు.  ఇక ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య, హీరోయిన్‌ శృతి హాసన్‌ తో పాటు…  బోయపాటి,  హరీష్‌ శంకర్‌, గోపిచంద్‌ మలినేని తదితరులు పాల్గొన్నారు.  ఇక ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే.. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news