ఇవాళ గద్వాలలో బాలయ్య “NBK107” సినిమా షూటింగ్

-

హీరో బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అఖండ సినిమాతో బంపర్‌ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఇప్పుడు.. తెలుగు కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేనితో నెక్ట్స్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు NBK 107 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.


అయితే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఇవాల్టి నుంచి 26 వ తేదీ వరకు కర్నూలు, గద్వాల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. కర్నూలు, కర్నూలు నగర శివార్లలో నందమూరి బాలకృష్ణ NBK107 సినిమా షూటింగ్ జరుగనుంది. ఇవాళ అలంపూర్, 21న యాగంటి, 22న ఓర్వకల్ గ్రీన్ కో, 23న పూడిచర్ల, 24న ఎయిర్ పోర్ట్, 25న కర్నూలు నగరంలో, 26న పంచలింగల వద్ద బాలకృష్ణ షూటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అభిమాన సంఘం… ఆయనను ఆహ్వానం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news