దివంగత నటుడు సుశాంత్ మృతితో బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం మొదలైంది. ఈ కేసుతో సంబంధం లేకపోయినా డ్రగ్స్‌తో సంబంధం వున్న వాళ్లని ఏరి పట్టుకునే ప్రక్రియని ఎన్సీబీ మొదలుపెట్టింది. ఈ క్రమంలో రియా కారణంగా రకుల్, దీపిక, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దియా మిర్జాలలకు ఎన్సీబీ వరుసగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రకుల్, దీపిక మేనేజర్ కరిష్మా ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు.
తాజాగా ఈ జాబితాలో కరణ్ జోహార్ పేరు ప్రధమంగా వినిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం కరణ్ జోహార్ ముంబైలోని తన నివాసంలో అర్థ్ర రాత్రి బాలీవుడ్ క్రేజీ స్టార్లకు ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో డ్రగ్స్ పారాయని గతంలో విమర్శలొచ్చాయి. ఆ పార్టీకి సంబంధించిన ఓ వీడియో ఇన్ స్టాలో వైరల్ అయ్యింది కూడా. ఒళ్లు తెలియని మత్తులో దీపికతో పాటు విక్కీ కౌషల్ లాంటి స్టార్స్ కనిపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అయితే దీనిపై తాజాగా శిరోమణి అకాలీదల్‌కు చెందిన మజిందర్ సింగ్ సిర్సా కేసు వేయడం కలకలం సృష్టిస్తోంది. అతని కంప్లైంట్‌ని సీరియస్‌గా తీసుకున్న నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రో బ్యూరో కరణ్ పార్టీకి సంబంధించిన వీడియోని ఫోరెన్సిక్ విభాగానికి పంపించింది. దీంతో కరన్ అరెస్ట్ లేదా విచారణ తప్పదనే వార్తలు జాతీయ మీడియాలో షికారు చేస్తున్నాయి. కొంత మంది మాత్రం డ్రగ్ పార్టీ అని తేలితే కరణ్ జైలుకి వెళ్లడం ఖాయం అంటున్నారు.