పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలను కాపాడిన ఎన్డీఆర్​ఎఫ్​

-

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం, కొత్తపల్లి గ్రామాల మధ్య పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా బయటికి వచ్చారు. వాగు మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వరి నాట్లు వేసేందుకు 23 మంది కూలీలు వెళ్లారు. నిన్న కురిసిన వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.

భద్రాచలం నుంచి ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది.. మొదట తొమ్మది మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరి కొంత మందిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో తాడు తెగిపోవడంతో మళ్లీ ప్రయత్నించింది. కానీ అప్పటికే .. రాత్రి కావడం, వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటు సహాయంతో బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్​ఎఫ్​ బృందం ప్రయత్నించింది. అయినా వీలుపడలేదు. దీంతో డ్రోన్‌ సాయంతో బాధితులకు ఆహారాన్ని అందజేశారు.

ఉదయం 6 గంటలకు బోటు సహాయంతో వెళ్లిన ఎన్డీఆర్​ఎఫ్​ బృందం.. బాధితులకు లైఫ్‌ జాకెట్లు అందజేసి.. సురక్షితంగా తీసుకువచ్చారు. 18 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు కూలీలను రక్షించారు. బయటకు వచ్చిన కూలీలు ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news