మే 21 వరకు లాక్ డౌన్ అవసరం… ఎలా అంటే…!

-

లాక్ డౌన్ ని దేశంలో ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది…? దీని మీద ఒక విషయం బయటకు వచ్చింది. దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుతుంది అనే దాని మీద ముంబై స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసి ఒక సర్వే చేసింది. ఎండ్ ఈజ్ నియర్ పేరిట దీనికి సంబంధించిన కథనం ప్రచురించింది. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మే 21 నాటికి తగ్గే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేసింది.

అప్పటికి కొత్త కేసులు ఇక పెరిగే అవకాశం లేదని స్పష్టంగా అంచనా వేసింది ఆ సంస్థ. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తేనే ఇది సాధ్యమని అంచనా వేసింది సంస్థ. ‘లాజిస్టిక్‌ డిస్ట్రిబ్యూషన్‌’ పద్దతి ద్వారా విదేశాల్లో కేసుల తగ్గుదల ఆధారంగా అంచనా వేసింది. వైరస్‌ తొలుత విజృంభించి గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుతుంది అని గుర్తించారు. ఇటలీ, స్పెయిన్, చైనా, జర్మని దేశాలను అంచనా వేసిన తర్వాత ఇది తెలిసిందని చెప్పారు.

మన దేశంలో వైరస్‌ వ్యాప్తి రేటును బట్టి తాము అధ్యయనం చేసామని పేర్కొన్నారు. వీరి అంచనా ప్రకారం చూస్తే మే 21 నాటికి వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్రలో 24,222 కేసులు నమోదుకానున్నాయని… గుజరాత్‌లో మే 7 నాటికి 4,833 కేసులను గుర్తించనున్నట్లు వాళ్ళు అంచనా వేసారు. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తాము అంచనా వేయలేము అని పేర్కొన్నారు. అంటే మే 21 వరకు లాక్ డౌన్ తప్పనిసరని పరోక్షంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news