“వాల్తేరు వీరయ్య” మూవీ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్‌

-

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి.

 

కేఎస్‌ రవింద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. పైగా ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అయితే, తాజాగా వాల్తేరు వీరయ్య ఐదో పాటకు సంబంధించిన అప్టేట్‌ ను వదలింది చిత్ర బృందం. నీకేమో అందమెక్కువ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పాటలో చిరంజీవి, శృతి హాసన్‌ మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అదిరిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news