ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ రాజకీయ రగడకు కారణమైంది. ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించకుండా ధిక్కార వైఖరితో వవ్యవహరించనందుకే ఆయనను బదిలీ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబతున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం తర్వాత చీఫ్ సెక్రటరీగా ఎవరు వస్తారనే దానిపై అటు ఉద్యోగ వర్గాల్లోనూ, ఇటూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఐతే సీఎస్ రేసులో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు నీలం సహానీ కాగా మరోకరు సమీర్ శర్మ. అయితే ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యానికి ఉద్వాసన పలికిన సీఎం జగన్… కొత్త సీఎస్ ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహానీ నినియమించనున్నట్లు తెలుస్తోంది. సహానీ 1984 కు క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది. కేంద్రం నుంచి రిలీవ్ కావడంతో త్వరలో సీఎస్ గా ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది.