అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రా ఘనత ఎప్పటికీ గుర్తుండిపోయేలా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒలింపిక్స్ ఆటల్లో జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలుచుకున్న ఆగస్టు 7వ తేదీని జావెలిన్ త్రో దినోత్సవంగా జరపాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశ అథ్లెట్లలో మొట్టమొదటిసారి ఒలింపిక్స్ ఆటల్లో బంగారు పతకం గెలుచుకుని దేశం మొత్తాన్ని సగర్వంగా నిలబడేలా చేసిన నీరజ్ చోప్రాకి గౌరవంగా ఈ నిర్ణయం తీసుకుంది. బంగారు పతకం అందుకున్న ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ త్రో దినోత్సవంగా తీసుకుంది.
ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్ పై అవగాహన, ఆసక్తి పెంచేందుకు కృషి చేసేందుకు ఈ జావెలిన్ త్రో దినోత్సవం ఉపయోగపడుతుందని, దేశం మొత్తం మీద ఈ రోజున అథ్లెటిక్స్ ఆడించాలని, తద్వారా భావి భారత క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపి ప్రపంచ వేదికలకు పంపాలన్న ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.