హైదరాబాద్ కు చెందిన వెంకట్ నరేన్, పి మాధురి అన్నా చెల్లెలు అయితే మాధురికి 2012లో వివాహం జరిగింది. గత కొద్దికాలంగా మాధురి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. మాధురి కిడ్నీ పాడైందని ట్రాన్స్ ప్లాంటేషన్ తప్పనిసరి అని వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా మాధురి అన్న వెంకట్ నరేన్ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం వెంకట్ నరేన్ మూత్రపిండాన్ని మాధురికి అమర్చేందుకు అనుకూలంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే తన భార్య పర్మిషన్ లేకుండా కిడ్నీ ఇవ్వడంపై అపోలో వైద్యులు నిరాకరించారు.
భార్య పర్మిషన్ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం వెంకట్ నరేన్ అతడి భార్యతో విడాకులకు అప్లై చేసుకున్నారు. దాంతో చెల్లెలికి కిడ్నీ దానం చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని నరేన్ కోర్టును ఆశ్రయించారు. కాగా చెల్లెలికి మూత్రపిండం దానం చేసేందుకు ముందుకు వచ్చిన అన్నకు హైకోర్టులో ఊరట లభించింది. కిడ్నీ దానం చేసేందుకు భార్య అనుమతి లేదంటూ అపోలో హాస్పిటల్ చేస్తున్నవాధనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య విడాకుల కేసు నడుస్తున్న కారణంగా భార్య అనుమతి లేకుండానే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అనుమతి ఇవ్వాలంటూ అపోలో ఆసుపత్రిని ఆదేశించారు.