వెబ్ ఆప్షన్ ఎంపికలో నిర్లక్ష్యం.. అందుకే సీటు కోల్పోతున్నారు..!

-

వైద్య విద్య ప్రవేశ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ ఎంతో కీలకమైనదని కాళోజీ ఆరోగ్యవర్సిటీ తెలిపింది. ప్రస్తుతం వైద్య విద్య ప్రవేశాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ధ్రువ పత్రాల పరిశీలన తర్వాత ప్రవేశాల్లో అతి ముఖ్యమైన ఘట్టం వెబ్ ఆప్షన్స్. అర్హులైన విద్యార్థులు కన్వీనర్ కోటాలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కళాశాల ఎంపికలో వెబ్ ఆప్షన్ కీలకమైంది. ఆచూతూచి కళాశాల ఎంపిక చేసుకోవడం.. వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కోవాలని కాళోజీ ఆరోగ్యవర్సిటీ తెలిపింది.

web options
web options

మెడికల్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్ ఎంపికపై అవగాహన లేకపోతే తదుపరి కౌన్సిలింగ్ కు అర్హత కోల్పోతున్నారని, జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలన్నారు. వచ్చే వారంలో ప్రారంభం కానున్న వెబ్ ఆప్షన్ ఎంపికపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ర్యాంకుకు తగ్గట్లు వైద్య కళాశాలలో సీటు పొందుతారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి అన్నారు.

మెడికల్ సీట్ల కేటాయింపు కోసం విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ఒక ప్రవేశ నిర్వహణ కమిటీని నియమిస్తోంది. ఆ కమిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిబంధనలలు అనుసరిస్తూ వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే విద్యార్థుల ర్యాంకు బట్టి ఆయా కళాశాలల్లో సీటు కేటాయిస్తారు. అయితే ఇక్కడ విద్యార్థులు కళాశాల ఎంపికలో తప్పులు చేస్తుంటారు. కళాశాల ప్రాధాన్య క్రమంలో విద్యార్థులు తాము చేరడానికి ఇష్టపడని కళాశాలలను సైతం జాబితాలో చేర్చుకుంటారు. వాటిలో సీటొస్తే చేరకుండా వదిలేస్తున్నారు.

అయితే నిబంధనల ప్రకారం.. వెబ్ ఆప్షన్ ఎంపిక చేసిన తర్వాత ఏ కళాశాలలో సీటు వస్తే కచ్ఛితంగా ఆ విడత కౌన్సిలింగ్ లో చేరాలన్నారు. ఒక వేళ సీటు వచ్చిన కళాశాలలో చేరకపోతే తర్వాతి విడత వెబ్ ఆప్షన్ కు అర్హత కోల్పోతారని డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. కళాశాలలో జాయిన్ అయితే తర్వాతి వెబ్ ఆప్షన్ కి అర్హులుగా పరిగణించబడతారన్నారు. అందుకే విద్యార్థులు తప్పని సరిగా మొదటి విడత కళాశాలలో జాయిన్ అవ్వాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకరరెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news