Live Video : నేపాల్ విమాన ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే..?

-

నేపాల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 68 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పొఖారా విమానాశ్రయానికి సమీపంలో ల్యాండింగ్​కు ముందు ఈ విమానం కుప్పకూలిపోయింది. అయితే తాజాగా ఇదే విమానానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది.

ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు ఈ విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడిపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. అనంతరం పెద్ద శబ్దం వినిపించింది. అయితే ఈ వీడియో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ భవనం పైనుంచి తీసినట్లుగా తెలుస్తోంది.

ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనతో నేపాల్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇవాళ ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. అందులో ఐదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 మంది విదేశీయులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news