ఆండ్రాయిడ్ నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్ల‌కు కొత్త ఫీచ‌ర్‌.. ఎలా వాడాలంటే..?

-

ప్ర‌ముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఆ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల కోసం ఓ సరికొత్త ఫీచ‌ర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. సాధార‌ణంగా నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు లేదా మూవీలు చూసేటప్పుడు యూజ‌ర్ల చేతి వేళ్లు తాకి వీడియోలు తిరిగి ప్రారంభం నుంచి ప్లే కావ‌డమో, కొంత వీడియో ముందుకు లేదా వెన‌క్కి జ‌రిగి ప్లే అవ‌డ‌మో లేదా స‌బ్ టైటిల్స్ ఆఫ్ అవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు.. స్క్రీన్ ట‌చ్ అయినా కంట్రోల్స్ ఏవీ రాకుండా వీడియో నిరాటంకంగా ప్లే అయ్యేందుకు నెట్‌ఫ్లిక్స్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

netflix for android gets screen lock feature

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై నెట్‌ఫ్లిక్స్‌ను వాడుతున్న యూజ‌ర్లు ప్ర‌స్తుతం స్క్రీన్ లాక్ అనే ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఏదైనా వీడియో లేదా మూవీ చూస్తున్న స‌మ‌యంలో స్క్రీన్‌పై ప్రెస్ చేస్తే స్క్రీన్ లాక్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే చాలు.. స్క్రీన్ లాక్ అవుతుంది. దీంతో చేతి వేళ్లు తాకినా.. కంట్రోల్స్ ఏవీ రావు. ఈ క్ర‌మంలో వీడియోను యూజ‌ర్లు సాఫీగా చూడ‌వ‌చ్చు.

ఇక స్క్రీన్‌లాక్‌ను డిజేబుల్ చేయాల‌నుకుంటే.. స్క్రీన్‌పై కనిపించే లాక్ ఆప్ష‌న్‌పై డబుల్ ట్యాప్ చేయాలి. ఇక ఈ ఫీచర్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ఐఓఎస్ నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోనూ ఈ ఫీచర్‌ను అందివ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news