జగన్ ఏరివేత యజ్ఞం .. రాజకీయం మారుతుందా ?

-

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నిక అయి పదకొండు నెలలు కావస్తుంది.  అయితే  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నియమకమైన కొంతమంది అధికారులను తొలగించడం లేదా అప్రదనమైన శాఖలకు బదిలీ చేయిస్తున్నారు. Andhra Pradesh CM YS Jagan Mohan Reddy urges CM Sonowal to allow ...జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న  ఏబీ వెంకటేశ్వరరావును ఆ పదవి నుండి తొలగించి,  ఏసీబీకి బదిలీ చేశారు. ఆ తరువాత  సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు అవకతవకలకు పాల్పడినట్లు భావించి చర్యలు తీసుకున్నారు.
అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి సిఈఓ విధులు నిర్వహిస్తున్న జాస్తి కృష్ణ కిషోర్ ను కూడా అవకతవకలకు పాల్పడ్డారని సస్పెండ్  చేశారు. అలాగే ఇప్పుడు తాజాగా స్థానిక ఎన్నికలను నిర్వహించని కారణం చేత ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తొలగించారు.
అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ముగ్గురు అధికారులను తొలగించడం చర్చనీయాంశం అయింది. ఇలా ప్రభుత్వం మారినప్పుడుదల్లా అధికారులు మారుతుండటంతో ప్రజలకు అధికారుల పని తీరుపై అనుమానం కలుగుతుంది. అధికారులు రాజ్యాంగ్యం ప్రకారం విధులు నిర్వహిస్తారా?  లేక రాజకీయ నాయకులు చెప్పినట్టు విధులు నిర్వహిస్తారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news