శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ అనూహ్య విజయం సాధించడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు లేకున్నా భారత్ గొప్ప విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనుక రాహుల్ ద్రావిడ్ ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ద్రావిడ్ సూచన మేరకు ఓపిగ్గా ఆడిన దీపక్ చాహర్ భారత్‌ను గెలుపుబాట పట్టించాడు. ఈ క్రమంలోనే ద్రావిడ్‌ను అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా మొదటి సిరీస్. అయినప్పటికీ ద్రావిడ్ ఇప్పటికే పలు రంజీ టీమ్‌లు, ఇండియా ఎ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ద్రావిడ్ శిక్షణలో ఇండియా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ద్రావిడ్ కోచ్‌గా అప్పుడే రాణించాడు. అయితే ఇప్పుడు మళ్లీ టీమిండియా విజయంలో అతను కీలక పాత్ర పోషించే సరికి అభిమానులు ద్రావిడ్ శిక్షణను మెచ్చుకుంటున్నారు.
Finally Rahul Dravid 😭❤️ pic.twitter.com/qfOmB8BhWC
— Wellu (@Wellutwt) July 20, 2021
భారత్ తాజా మ్యాచ్‌లో 7 వికెట్లకు 193 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ద్రావిడ్ మైదానంలోకి వచ్చి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఉన్న రాహుల్ చాహర్‌కు మెసేజ్ ఇచ్చాడు. మైదానంలో ఉన్న దీపక్ చాహర్‌కు తన సూచనలు తెలియజేయాలని చెప్పాడు. దీంతో రాహుల్ చాహర్ అలాగే చేశాడు. ఫలితంగా దీపక్ చాహర్ తన భాగస్వామి భువనేశ్వర్‌తో కలిసి వికెట్ కోల్పోకుండా సమయస్ఫూర్తితో ఆడారు. మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. ద్రావిడ్ ఇచ్చిన మెసేజ్ వల్లే టీమిండియా విజయం సాధించిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ద్రావిడ్ సయమస్ఫూర్తిని, శిక్షణ మెళకువలను అందరూ మెచ్చుకుంటున్నారు.