నిజంగా అతిలోక సుందరీమణుల గురించి వినడమే తప్ప చూసింది లేదు… అనుకుంటున్న దశలో నిజంగానే దేవకన్యలు ఇలా ఉంటారా అంటూ వెండితెరపై ప్రత్యక్షమైన నటి శ్రీదేవి. ఆమెను అతిలోకసుందరి అన్న సమయంలో ఎటువంటి అభ్యంతరాలూ రాకుండా అటు హీరోలు, ఇటూ హీరోయిన్ లు సైతం అంగీకరించారంటేనే అర్ధం చేసుకోవాలి… ఆమె అందం ఎంతో అని! అయితే… తాజాగా ఈ సుందరి అభిమానులు ఒక యుద్ధం ప్రారంభించారు!
అవును… నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీదేవి.. నటనలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి.. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో తన ఉన్న హోటల్ రూం బాత్ టబ్‌లో పడి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణం… హత్య అని, ప్లాండ్ మర్డర్ అని అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే… తాజాగా మరోసారి ఆమె మరణంపై ఆన్ లైన్ లో ఒక ఉద్యమం లేచింది.
ఆగస్ట్ 13న శ్రీదేవి జయంతి సందర్భంగా శ్రీదేవి అభిమానులు నెట్టింట ఓ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. “సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి” అనే ఈ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత శ్రీదేవి అభిమానులు ఇలా సోషల్ మీడియాలో ఇంతలా రచ్చ చేయడానికి కారణం… సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం!!
సుశాంత్ మరణంపై బాలీవుడ్ లో పెనుదుమారమే రేగుతోన్న తరుణంలో… సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీంతో… దేశం కాని దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్రీదేవి మరణంపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని ఆమె అభిమానులు.. జయంతి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు! ఆన్ లైన్ వేదికగా ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు!! మరి కేంద్రం స్పందిస్తుందా.. లేదా.. అనేది వేచి చూడాలి!!