కాజల్ చేసిన పనికి నోరెళ్ళ బెడుతున్న నెటిజన్స్..కారణం..?

-

చందమామ ఫేమ్ కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇండియన్ 2 సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి బాలయ్య కెరియర్ లోనే మరో సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సమయంలోనే బాలయ్య చేస్తున్న మరొక సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వీర సింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో బాలయ్యకు జోడిగా ఆ మధ్య పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి కాజల్ అగర్వాల్ పేరు ఖరారు చేశారు. అని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషకం గురించి ప్రచారం బాగా జరుగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాజల్ అగర్వాల్ ఏకంగా 2 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటోందని సమాచారం. సాధారణంగా కాజల్ అగర్వాల్ పారితోషకం ఒకప్పుడు కోటికి పైగానే ఉండేది కానీ పెళ్లయి , బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె ఇంత రేంజిలో పారితోషకం అందుకోవడం అంటే నిజంగా మామూలు విషయం కాదు.. ఒకవేళ ఈమెకు ఈ పారితోషకం దక్కింది అంటే కచ్చితంగా ఈ ఆఫర్తో ఆమెకి మంచి ఆఫర్ సొంతం చేసుకున్నట్లే. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news