సోషల్ మీడియాలో రామ్ చరణ్ అరుదైన రికార్డ్.!

-

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ వరల్డ్, పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులు అందరూ రామ్ చరణ్ లో శ్రీరాముడు ను చూసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇక రామ్ చరణ్ – ఉపాసన జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటంతో చిరంజీవి వంశంలో రామ్ చరణ్ వచ్చి నట్లుగా మరో తరం రాబోతుందని ఇటు అభిమానులు చాలా ఆనంద పడుతుతున్నారు.

ఇక RRR మూవీ తో రామ్ చరణ్ క్రేజ్ సూపర్ గా పెరుగుతూ వస్తోంది. ఇక తన భార్య ఉపాసన కూడా తన ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అయితే తాను ఇప్పుడు 12 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించు కు న్నాడు. దీనితో టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా అరుదైన రికార్డ్ లో కూడా చేరి పోయాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news