లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా..? ఆనందంగా ఉండలేకపోతుంటే ఇలా చెయ్యండి..!

-

ప్రతి ఒక్కరూ ప్రేమలో సక్సెస్ అవ్వలేరు. చాలా మంది ప్రేమికులు మధ్యలోనే విడిపోవాల్సి వస్తుంది. అయితే లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఎంతో బాధ ఉంటుంది అస్తమాను పార్ట్నర్ గుర్తుకు రావడం… కలిసి ఆనందించిన క్షణాల గుర్తుకు రావడం ఇలా పదేపదే పాత జ్ఞాపకాలు పొడుస్తూ ఉంటే గుండె పగిలిపోయినట్లు అనిపిస్తుంది. అయితే లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆనందంగా ఉండకూడదు అని ఏమీ లేదు. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ మీ జీవితాన్ని రీస్టార్ట్ చేసి ఆనందంగా ఉండొచ్చు.

 

వాలెంటైన్స్ డే నాడు చక్కగా మీ ప్రేయసి తో లేదా ప్రియుడుతో ఆనందంగా ఉండాలని మీరు అనుకుని.. లవ్ ఫెయిల్యూర్ వలన ఆనంద క్షణాలని అనుభవించలేకపోతున్నామని బాధపడకండి. లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ఆనందంగా ఉండొచ్చు. మీ అవసరాలని మీరు చూసుకుంటూ మీ ఎమోషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నట్లయితే కచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు. సింగిల్ గా ఉంటూ ఆనందంగా కూడా ఉండొచ్చు. మరి లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎలా ఆనందంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

మీకోసం సమయం ఇవ్వండి:

బ్రేకప్ అయిన తర్వాత మీకు ఏమనిపిస్తే దానిని చేయండి.
మీకోసం మీరు కాస్త సమయం ఇస్తే ఆనందంగా ఉండొచ్చు.
వెంటనే మీరు మరొకరితో రిలేషన్ షిప్ లో ఉండొద్దు.
మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో దానికోసం సమయం ఇస్తూ ఉండండి.

గతాన్ని మర్చిపోండి:

మొదట మీరు మీ ప్రేమ విఫలమైందని నమ్మండి.
ఏమీ మారలేదు అలానే ప్రేమ ఉంది అని పదేపదే భావించి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి.
లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మీ ఎక్స్ తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. వారికి కోపం తెప్పించడం విసుగు పెట్టించడం వంటివి చేయొద్దు.
ఎక్స్ కి సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటినీ కూడా దూరంగా ఉంచేయండి. అలానే మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఇతరులకి కూడా చెప్పుకోవద్దు.

అది అయిపోయిందని యాక్సెప్ట్ చేయండి:

వాళ్ల గురించి ఆలోచించడం వంటివి చేయొద్దు. మీకోసం మీరు చూసుకోండి.
లవ్ ఫెయిల్యూర్ అయిందని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. నచ్చిన వాటి మీద ధ్యాస పెట్టండి.
మీకు నచ్చిన వాటి మీద ధ్యాస పెట్టండి.
మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానిని చేయండి.
కొత్తగా లైఫ్ ని స్టార్ట్ చేసి అందంగా మార్చుకోండి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి.
కొత్త యాక్టివిటీస్ తో మంచి స్నేహితులతో మీరు సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఇలా మీరు లవ్ ఫెయిల్యూర్ నుండి బయటపడి ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news