నాని దసరా సినిమా విషయం లో కాన్ఫిడెన్స్ లేక ఓవర్ కాన్ఫిడెన్స్ తోనా.!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా సినిమా  మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు.  ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు.

ఇక పోస్టర్ వెనకాల సిల్క్ స్మిత పోస్టర్ పెట్టుకొని మా సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సింబాలిక్ గా చెబుతున్నాడు. సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దసరా సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ ఈవెంట్ సందర్బంగా నాని  మాట్లాడిన మాటలు పరిశ్రమ లో హంగామా సృష్టించు చున్నాయి.గత ఏడాది తెలుగు నుండి ఆర్ఆర్ఆర్ మరియు కన్నడం నుండి కేజీఎఫ్ సినిమా వచ్చింది. ఈ ఏడాది తెలుగు నుండి దసరా వస్తుందని తన సినిమాను ఆ రెండు సినిమాలతో పోల్చి పొగడ్తల వర్షం కురిపించాడు. మొత్తానికి దసరా సినిమా పై నాని కి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అలాగే తన సినిమా డైరెక్టర్ పై విపరీత నమ్మకంతో  శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరును గుర్తు పెట్టుకోండి అని కూడా నాని ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news