దిల్ రాజు నిర్మాణం లో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ నటిచిన వారీసు సినిమా తమిళనాడు లో విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక వారిసూ ను వారసుడును తెలుగు లో ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ బరిలో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా అలాగే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది. తెలుగు లో మాత్రం వారసుడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్ళు సాధించడం లేదు.కాని తమిళంలో మాత్రం వారిసు కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ విజయ్ కు వున్న స్టామినా వల్ల సినిమా బాగా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది.
ఇక తమిళంలో 139 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 19 రోజుల్లో 276 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 200 క్లబ్ లో చేరిపోయింది. 140.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది దీంతో 1.80 కోట్ల ప్రాఫిట్ సినిమాకి వచ్చింది. ఇక తెలుగు శాటిలైట్ ఒటీటీ రైట్స్ తో కలుపుకుంటే సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే 100 కోట్ల వరకు దిల్ రాజు వారిసు మూవీతో అదనంగా సంపాదించినట్లే అని దిల్ రాజు ఈ సినిమా వల్ల నష్టపోలేదు అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.