“ఆ ఎన్నారై” లకి షాక్.. 5 గురి వీసాలు రద్దు. 59 మందిపై కేసులు..

-

మనదేశం లో తల్లితండ్రులకు వారి పిల్లలు విదేశాలలో ఉన్నారు అని గర్వంగా చెప్పుకోవాలని ఉంటుంది. కొడుకులు అయితే విదేశాలలో మంచి ఉద్యోగం చేయాలి, అదే కూతురు అయితే మంచి ఎన్నారై కి ఇచ్చి పెళ్ళిచేయాలని ఆశపడతారు. గతం లో అయితే ఈ ఆశ మరీ ఎక్కువ ఉండేది, ఖర్చు ని లెక్క చేయకుండా స్తోమతకు మించి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసేవారు. ఎందుకంటే వారి కూతురు విదేశాలలో ఎంతో సుఖంగా ఉంటుందని ఆశ. కానీ కొంత మంది తల్లి తండ్రులకి అది నిజంగానే కల గానే మిగిలేది. ఎందుకంటే..

కొంతమంది ఎన్నారైలు  పెళ్లి చేసుకుని భార్యాలకి  నరకం చూపించేవారు. అదనపు కట్నం కోసం కొందరు, ఖరీదైన బహుమతుల కోసం మరికొందరు హింసించేవారు. దేశం కాని దేశం లో ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునేవారు. కొందరు నరకాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలేసేవారు. అలాంటి వారి భద్రత కోసం భారతదేశంలో  కొత్త విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీని పేరు “ఎన్నారై మహిళా భద్రత కేంద్రం”. దీని ద్వారా  విదేశాలలో భారత మహిళలపై వేధింపులకి పాల్పడే భర్తల వికృత చేష్టలకి అడ్డుకట్ట పడుతుందని విశ్వసిస్తున్నారు.

ఈ విభాగాన్ని ప్రారంభించిన్నప్పటి నుంచి ఇప్పటికి ఐయిదుగురిపై చర్యలు తీసుకున్నారు. వారి వీసాలని రద్దు చేయించి కేసులు నమోదు చేశారు. అయితే గతం లో ఈ విభాగానికి బదులుగా రెడ్ కార్నెర్ లో నోటీసులు జారీ చేసేది భారత ప్రభుత్వం. కాని అక్కడ చట్టలలోని లొసుగులు అడ్డుపెట్టుకొని కేసు నుంచి సులువుగా బయటపడేవారు. అందుకే ఇక భారత ప్రభుత్వం కూడా ఏకంగా విభాగాన్నే ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునర్ఘతం అవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి 59 కేసుల మీద దృష్టి పెట్టి, అందులోని నిజాలు తెలుసుకొని వారిని భారత దేశానికి రప్పించటం లో ఈ విభాగం కీలాగ పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news