‘మత్తువదలరా’ మూవీ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్…..!!

-

టాలీవడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోగా ఎంత ఎత్తున ఉన్నపటికీ, వ్యక్తిగతంగా అందరితో కలిసి మెలసి వ్యవహరిస్తూ ఒదిగిపోయి ఉంటారని అనేకమంది సినిమా ప్రముఖులు చెప్తూ ఉంటారు. ఇక తనకు కెరీర్ పరంగా ఛత్రపతి, బాహుబలి వంటి సూపర్ హిట్స్ ని అందించిన రాజమౌళి, కీరవాణి అంటే ఆయనకు ఎనలేని అభిమానం ఉండడంతో, ప్రస్తుతం కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహాను హీరోగా, పెద్ద కుమారుడు కాలభైరవను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ‘మత్తు వదలరా’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

నిన్న ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ప్రభాస్, ఆ సినిమా యూనిట్ అందరితో కలిసి కాసేపు ముచ్చటించారు. మంచి వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని ప్రభాస్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. వారితో కలిసి సరదాగా ప్రభాస్ ముచ్చటించిన వీడియో రేపు సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా యూనిట్ తో కలిసి ప్రభాస్ దిగిన ఒక ఫోటోను అధికారికంగా రిలీజ్ చేసారు. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాను చిరంజీవి (చెర్రీ) నిర్మించారు. కొత్తవాళ్లంతా కలిసి రూపొందించిన ఈ  సినిమా పై పలువురు ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు కూడా పాజిటివ్ స్పందనను అందిస్తున్నారు.

 

ఇటీవల రాజమౌళి, కీరవాణి ఈ సినిమాపై స్పందిస్తూ, ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల వలె చూసిన మాకు ఎంతో బాగా నచ్చిందని, తమ కొడుకుల గురించి తామే గొప్పలు చెప్పడం సరికాదని, అయితే ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుంది అనేది ప్రేక్షకులే రాబోయే రోజుల్లో తేలుస్తారని వారు అన్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా చూసిన ప్రభాస్, పాజిటివ్ గా స్పందించడంతో, అది కొంతవరకు తమ సినిమాకు పబ్లిసిటీగా ఉపయోగపడుతుందని మత్తువదలరా యూనిట్ భావిస్తోంది……!! .

Read more RELATED
Recommended to you

Latest news