నెల్లూరులో కొత్త వివాదానికి తెర పడింది. రియల్ ఏస్టేట్ వెంచర్ల వివాదం పొలిటికల్ లీడర్ల వైపు మళ్లుతోంది. ఈ పొలిటికల్ లేఅవుట్ వివాదం.. మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఏ టార్గెట్‌గా కొనసాగుతోంది. అనిల్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు లేఅవుట్ మంజూరులో రూ.3 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన సహచరుడైన.. మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి అక్రమ లేఅవుట్‌లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వెంచర్లలో అనిల్ బినామీగా కిన్నెర ప్రసాద్ ఉన్నాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.
అక్రమ లేఅవుట్‌ల వ్యవహారంలో నారా లోకేశ్ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. దీంతో నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలు నెల్లూరు అర్బర్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా నెల్లూరు శివారులోని ఎన్టీఆర్ నగర్‌లో వేస్తున్న లేఅవుట్ వివాదాస్పదంగా మారింది. దీంతో నూడా వైస్ చైర్మన్‌ను కలిసి మాజీ మంత్రి అనిల్ యాదవ్‌పై మాజీ నూడా చైర్మన్ కోటం రెడ్డి ఫిర్యాదు చేశారు.