క్రేజీ న్యూస్‌ : సమంతను వరించిన ఉత్తమ నటి అవార్డు

-

వెర్రీ టాలెంటడ్‌ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది సమంత. దానికి కారణం ఆమె సినిమాలో ఎంచుకునే పాత్ర. విలన్‌గానైనా, ఐటెం సాంగ్‌లోనైనా, హీరోయిన్‌గానైనా.. ఏ పాత్ర నచ్చిన అందులో పరకాయ ప్రవేశం చేసి జీవించేస్తుంది. అందుకే సమంతను ఉత్తమ నటి అవార్డు వరించింది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత సినిమాల‌లో మరింత జోరును ప్ర‌ద‌ర్శిస్తుంది. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసిన స‌మంత ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతూనే ఉంది.

Samatha Gets Bold In The Family Man 2 | Galli 2 Delhi Telugu News*

అమెజాన్ సంస్థ తెర‌కెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత పోషించిన రోల్‌కు ప్రేక్ష‌కుల నుంచి క్రిటిక్స్ వ‌ర‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అంతేకాకుండా ఈ వెబ్‌సిరీస్‌తో స‌మంత‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వ‌చ్చింది. తాజాగా ఈమె న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టి అవార్డును అందుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ సంస్థ ఈ అవార్డును అందించింది. ఈ అవార్డు ప‌ట్ల స‌మంత సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్‌లో అవార్డుతో దిగిన ఫోటోను షేర్‌ చేసింది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news