కొత్త ఈ-కామ‌ర్స్ సైట్ లాంచింగ్‌.. సుల‌భ ఈఎంఐల‌లో వ‌స్తువుల‌ను కొన‌వ‌చ్చు..

-

ఆన్‌లైన్‌లో ఏదైనా వ‌స్తువును కొనాల‌ని చూస్తున్నారా ? అందుకు త‌గిన డ‌బ్బు మీ వ‌ద్ద లేదా ? ఫైనాన్స్ లో ఆ వ‌స్తువును కొందామంటే డౌన్ పేమెంట్ ఎక్కువ‌గా చెల్లించాల్సి వ‌స్తుందా ? అయితే మీలాంటి వారికోస‌మే క్రెడిట్ కార్ట్ ఫిన్‌-కామ్ పేరిట ఓ స‌రికొత్త ఈ-కామ‌ర్స్ షాపింట్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వ‌స్తోంది. ఉధార్ కీ దుకాన్ పేరిట బై నౌ పే లేట‌ర్ విధానంలో ఈ సైట్‌లో వినియోగ‌దారులు వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

new e-commerce platform launching customers can buy items in easy emis

పూణెకు చెందిన ముద్ర‌క్విక్ ఫిన్‌టెక్ ఈ సైట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఆగ‌స్టు 28 నుంచి ఈ సైట్ అందుబాటులోకి రానుంది. ఇందులో వినియోగ‌దారులు దుస్తులు, ఫుట్‌వేర్‌, బ్యాగులు, యాక్స‌స‌రీలు, ఫ‌ర్నిచ‌ర్ వ‌స్తువులు, అప్ల‌య‌న్సెస్‌, ఎల‌క్ట్రానిక్స్ త‌దిత‌ర వ‌స్తువుల‌ను ఈఎంఐ విధానంలో కొన‌వచ్చు. దీనికి ప్రాసెసింగ్ ఫీజు, వ‌డ్డీ, డౌన్ పేమెంట్ కూడా చెల్లించాల్సిన ప‌నిలేదు. వినియోగ‌దారులు కొన్న వ‌స్తువుల‌కు సుల‌భంగా ఈఎంఐల‌లో డ‌బ్బు చెల్లించ‌వ‌చ్చు.

ఈ సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వారికి క్రెడిట్ లైన్ ఇస్తారు. దాన్ని అనుస‌రించి వారు వ‌స్తువుల‌ను కొన‌వ‌చ్చు. సాధార‌ణంగా చాలా మంది ప్రాసెసింగ్ చార్జిలు ఎక్కువ‌ని, డౌన్ పేమెంట్ ఎక్కువ‌గా చెల్లించాల‌ని, వ‌డ్డీ ఎక్కువ ప‌డుతుంద‌ని చెప్పి వ‌స్తువుల‌ను ఈఎంఐలో కొనేందుకు నిరాస‌క్త‌తను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అలాంటి వారికి త‌మ క్రెడిట్ కార్ట్ ఫిన్‌-కామ్ ప్లాట్‌ఫాం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ముద్ర‌క్విక్ ఫిన్‌టెక్ ఫౌండ‌ర్‌, డైరెక్ట‌ర్ స్వ‌ప్నిల్ మ‌దియార్ తెలిపారు. దీని వ‌ల్ల వినియోగ‌దారులు తాము కావాల‌నుకున్న వ‌స్తువుల‌ను ఎలాంటి సుదీర్ఘ‌మైన ప్రాసెస్ లేకుండానే సుల‌భంగా కొన‌వ‌చ్చ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news